ఎవరైనా ఈ రోజే ఫస్ట్ మ్యాచ్ అంటే ఫుల్ టెన్షన్ లో ఉంటారు. అశ్వనీ కుమార్ అనే కుర్రాడు కూడా ముంబై ఇండియన్ తన కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు టెన్షన్ గా ఉన్నాడు. అయితే ఎంత టెన్షన్ పడితే మాత్రం కెరీర్ లో వేస్తున్న మొదటి ఓవర్ లో వేసిన తొలి బంతికే వికెట్టు తీసేసుకుంటారా ఎంత టెన్షన్ పడితే మాత్రం. అవుట్ చేసింది కూడా సాధారణమైన బ్యాటర్ ని కాదు సాధారణంగా తప్పులే చేయని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానేని. లెఫ్టార్మ్ పేస్ తో కూల్ అండ్ కామ్ యాక్షన్ తో వస్తున్న బౌలర్ ని బచ్చా గాడులే అనుకుని లైట్ తీసుకుని షాట్ ఆడిన రహానే కి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయ్. తిలక్ వర్మ పట్టిన అద్భుమైన క్యాచ్ కి అవుటైపోయాడు రహానే. వేసిన ఫస్ట్ బంతికే వికెట్ తీసుకుని తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు అశ్వని కుమార్. మళ్లీ ఓవర్ ఇవ్వలేదు పాండ్యా. జాగ్రత్తగా దాచాడు ఆ కుర్రాడిని. తిరిగి ఇన్నింగ్స్ 11 ఓవర్ బంతి చేతికి ఇస్తే ఈ సారి కేకేఆర్ స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ వికెట్ లేపేశాడు. అశ్వనీ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ అర్థం చేసుకోలేక నమన్ ధీర్ కి క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు రింకూ సింగ్. మళ్లీ అదే చివరి బంతికి మనీష్ పాండేని క్లీన్ బౌల్డ్ చేశాడు అశ్వనీ కుమార్. మళ్లీ 13ఓవర్ లో బౌలింగ్ కి వచ్చి నాలుగో బంతికి అత్యంత ప్రమాదకరమై ఆంద్రే రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేసి పారేశాడు అశ్వనీ కుమార్. రెండు షార్ట్ పిచ్ బాల్స్ వేసి రస్సెల్ కి చిరాకు తెప్పించి మూడో బాల్ యార్కర్ లెంగ్త్ వేస్తే రస్సెల్ కి మాత్రం ఏం అర్థం అవుతుంది. క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అలా డెబ్యూ చేసిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే మూడు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసి ...ఐపీఎల్లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత పేసర్ గా చరిత్ర సృష్టించాడు అశ్విని కుమార్. మ్యాచ్ అయ్యాక మధ్యాహ్నం లంచ్ లో ఏం తిన్నావంటే ఏం చెప్పాడో తెలుసా. ఇవాళ మ్యాచ్ ఆడాలి నువ్వు ప్రిపేర్ కా అని పాండ్యా చెప్పగానే ఆకలి వేయలేదు. ఫుల్ టెన్షన్ వచ్చింది. అందుకే అరటి పండు మాత్రమే తిన్నా మధ్యాహ్నం..అలాగే మ్యాచ్ ఆడేశా అన్నాడు. అంటే అరటిపండు మాత్రమే తినొచ్చి డిఫెండ్ చాంఫియన్ ని గల్లంతు చేశావు కదయ్యా అశ్వనీ కుమార్.